నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు పోలింగ్ కేంద్రంలో చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన ఆమెను.. కొందరు ఓటర్లు నిలదీశారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కవిత అక్కడి నుంచి వెనుదిరిగారు.

పూర్తివివరాల్లోకి వెళితే.. తెలంగాణలో శుక్రవారం లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న ఆమె పోలింగ్ సరళిని పరిశీలించేందుకు భోధన్ నియోజకవర్గంలో పర్యటించారు.

కాగా... అక్కడ ఆమెకు నిరసన ఎదురైంది. ఇప్పటి వరకు డబల్ బెడ్రూం ఇళ్లు తమకు ఎందుకు ఇవ్వలేదని కొందరు మహిళలు కవితను నిలదీశారు. కొందరు తమకు పింఛన్లు కూడా రావడం లేదని ఆరోపించారు. కాగా.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కవిత ప్రయత్నించినప్పటికీ.. వారు వినిపించుకునేలా కనిపించలేదు.

దీంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత మరికొన్ని పోలింగ్ స్టేషన్లను ఆమె పరిశీలించారు.