హైదరాబాద్: తనపై సినీ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ మనుషులు దాడి చేశారని కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14 లో భూ వివాదం విషయమై ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై ఇరువర్గాలను పోలీసులు విచారిస్తున్నారు. 

హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో   పీవీపీకి మరో వ్యక్తి  కైలాస్ విక్రమ్  వివాదం చోటు చేసుకొంది. పీవీపీ తనపై దాడి చేయించారని పోలీసులకు కైలాష్ విక్రమ్ ఫిర్యాదు చేశారు.

పీవీపీ మనుషులు తనపై దాడి చేశారని కైలాష్ చేస్తున్న ఆరోపణలను పీవీపీ కొట్టిపారేశారని ఓ తెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది.. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వీరి మధ్య విబేధాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. తనపై దాడి చేశాడని పీవీపీపై కైలాష్ విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఇద్దరిని పోలీసులు విచారించినట్టుగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది.