టెన్త్ ఫలితాలు విడుదల చేసిన కడియం

kadiam srihari announces ssc results
Highlights

సత్తా చాటిన ప్రయివేటు పాఠశాలలు

టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో ప్రయివేటు స్కూల్స్ సత్తా చాటాయి. రాష్ట్రవ్యాప్తంగా వందకు వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 2125 ఉండగా అందులో ప్రయివేటు పాఠశాలలు 1225 ఉండడం గమనార్హం. వంద శాతం సాధించిన పాఠశాలల్లో

686 జెడ్పీ పాఠశాలలు

76 కస్తూరిబా పాఠశాలలు

35 మోడల్ స్కూల్స్

30 గవర్నమెంట్ హై స్కూల్

20 ఆశ్రమ స్కూల్స్

18 సోషల్ వెల్పేర్ 18

1225 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయని మంత్రి కడియం వెల్లడించారు.

కొన్ని పాఠశాలలు జీరో ఫలితాలు సాధించగా అందులో21 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.

5లక్షల 34వేల 726 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు  హాజరయ్యారని తెలిపారు. అందులో 83.78 శాతం పాసయ్యారని వివరించారు. బాలికలదే ఈసారి కూడా పైచేయి అన్నారు. బాలికల ఉత్తీర్ణత శాతం 85.14 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం  83.43గా ఉందన్నారు.  ఫలితాల పట్టికలో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉండగా ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానం దక్కించుకుందన్నారు.

బిసి రెసిడెన్సియల్స్ 96 శాతం పాస్ అయి సత్తా చాటాయన్నారు. తెలంగాణ రెసిడెన్సియల్స్ 94శాతం నమోదు చేయగా ప్రయివేటు స్కూల్స్ 5వ స్థానంలో ఉన్నాయన్నారు.  

loader