రమణ్ సింగ్ మేడారం టూర్ పై బీజేపీ రాజకీయమా

రమణ్ సింగ్ మేడారం టూర్ పై బీజేపీ రాజకీయమా

చత్తీస్ ఘడ్ సిఎం రమణ్ సింగ్ మేడారం రాక సందర్భంగా తెలంగాన సర్కార్ పరైన భద్రత చర్యలు తీసుకోలేదంటూ వస్తున్న విమర్శలపై ఉపముఖ్యమంత్రి కడియం స్పందించారు. దేశంలోనే అత్యంత రిస్క్ ఉన్న సిఎంలలో రమణ్ సింగ్ ఒకరు. అందువల్లే ఆయన కోసం అనేక భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే ఇక్కడి పోలీసులను సంప్రదించకుండానే మేడారానికి చేరుకున్న రమణ్ సింగ్ ను జాతీయ భద్రతా సిబ్బంది నేరుగా గద్దెల వద్దకు తీసుకెళ్లారు. దీంతో వారికి, మన పోలీసులకు సమన్వయం కుదరకే కాస్త గందరగోళం జరిగిందని అన్నారు కడియం. మాకిచ్చిన సిఎం సెక్యూరిటీ ప్లాన్ ను పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని, ఇందులో తమ తప్పేమిలేదని, ఏదేమైనా ఆయనకు అసౌకర్యం కలిగించినందుకు బాధపడుతున్నామన్నారు. రమణ్ సింగ్ ను మేడారంకు సాధరంగా ఆహ్వానించి, సన్మానం చేశామని, ఈ ఆహ్వానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. కానీ ఇక్కడి బిజెపి నాయకులు ప్రతిదీ రాజకీయం చేసేందుకే చూస్తున్నారని, అందుకోసమే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.  లక్షలమంది భక్తులు వచ్చే జాతరలో చవకబారు రాజకీయాలు చేయడం మంచిది కాదని బిజేపిపై మండిపడ్డారు కడియం.   

ఇక జాత విశేషాల గురించి మాట్లాడిన కడియం, ఇప్పటికే తల్లులను 50 లక్షల మంది భక్తులు  దర్శించుకున్నారని తెలిపారు. వచ్చే మూడు రోజుల్లో మరింత మంది భక్తులు రానున్నారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇక సమస్యల గురించి నేరుగా భక్తుల వద్దకు వెళ్లి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఇక ట్రాఫిక్ సమస్యను ప్రస్తుతానికి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని, భక్తులు చాలా గొప్పగా సహకరిస్తున్నారన్నారు.  

  రెండవ తేదీ అంటే రేపు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసిఆర్ సమ్మక్క-సారమ్మలను దర్శించుకునేందుకు వస్తున్నారని , అందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సిఎం, ఉప రాష్ట్రపతి రాకల సందర్భంగా రేపు మధ్యాహ్నం సాధారణ భక్తులకు కాస్త అసౌకర్యం కలిగినా సహకరించాలని అన్నారు. రేపు 24 గంటలు భక్తుల సందర్శనార్ధం తల్లుల గద్దెలు తెరిచే ఉంచుతామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కడియం తెలిపారు.   
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page