గుర్తు తెలియని వాహనం, ఎస్సై బైక్ ని ఢీ కొట్టడంతో ప్రమాదం

మేడ్చల్ జిల్లా కీసర లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఎస్సై ని బలితీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పై బైక్ పై వెళుతున్న కాచీగూడ ఎస్సైని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. 

కీసర ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఎస్‌ఐ నరసింహరావు(52)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఎస్‌ఐ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. 

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.