హైదరాబాద్:  గుత్తా సుఖేందర్ రెడ్డికి  కేసీఆర్  మంత్రివర్గంలో చోటు దక్కనుంది.ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఐదుగురు ఉన్నారు. సుఖేందర్ రెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డికి కేబినెట్ లో చోటు దక్కనుందని సమాచారం.దీంతో ప్రస్తుతం ఉన్న ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం మంత్రులకు మంత్రి వర్గం నుండి ఉద్వాసన చెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ లో 12 మంది మంత్రులు ఉన్నారు. కేసీఆర్ సహా మొత్తం ప్రస్తుతం 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉంది.ఇందులో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు.

సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. సుఖేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

సుఖేందర్ రెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డిని కూడ కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

కేసీఆర్ మంత్రివర్గంలో మహిళా మంత్రులు ఎవరూ కూడ లేరు. గత టర్మ్‌లో కూడ కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిథ్యం లేదు.ఈ విషయమై విమర్శలను ఎదుర్కొన్నారు.

తన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించనున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హామీ ఇచ్చారు. మరోవైపు ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో మున్నూరుకాపు సామాజిక వర్గం నుండి కూడ ఎవరికి ప్రాతినిథ్యం లేదు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏడుగురు గెలిచారు.

మరోవైపు ఎస్టీలకు కూడ కేబినెట్‌లో కూడ చోటు దక్కలేదు. త్వరలోనే కేసీఆర్ కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే రెండు వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించనట్టు అవుతోంది.అయితే ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన పలుకుతారనే చర్చ సర్వత్రా సాగుతోంది.
 

సంబంధిత వార్తలు

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....