Asianet News TeluguAsianet News Telugu

కొత్త ఏడాదిలో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు?

2020లో సీఎం పదవిని కేటీఆర్ కు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని టీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 

K Chandrasekhar Rao to hand crown to KTR in 2020
Author
Hyderabad, First Published Dec 16, 2019, 8:28 AM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొడుకు మంత్రి కేటీఆర్ కు సీఎం పగ్గాలను 2020లో కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. వాస్తవానికి 2019లోనే కేటీఆర్ కు పగ్గాలు ఇస్తారనే ప్రచారం సాగింది. కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే విషయాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌లు కూడ ఖండించారు.

also read:Year roundup 2019:తెలంగాణలో కమలానికి కలిసొచ్చిన కాలం

తెలంగాణ సీఎం పదవిని కేటీఆర్ కు అప్పగిస్తే పార్టీ పదవిలో కేసీఆర్ కొనసాగుతారనే ప్రచారం కూడ సాగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ, యూపీఏకు ఎక్కువ సీట్లు దక్కకపోతే ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారు.కానీ, కేంద్రంలో ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. దీంతో కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం లేకుండా పోయింది.

Also read:Year roundup 2019:ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కేసీఆర్

ఎన్డీఏ, యూపీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ దక్కకపోతే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేవాడు. ఆ సమయంలో కేటీఆర్ కు పగ్గాలు అప్పగించేవాడనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే పరిస్థితులు మారాయి.

Also read:Year Roundup 2019:రికార్డు సృష్టించిన ఆర్టీసీ సమ్మె, ఎవరిది పై చేయి

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ 16, ఆ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం మరో స్థానంలో విజయం సాధించే అవకాశం ఉందని కేసీఆర్ భావించారు. కానీ, టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో, కాంగ్రెస్ మూడు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. 

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ విజయం సాధించిన కొన్ని రోజుల్లోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్ కు కట్టబెడుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.

టీఆర్ఎస్ కార్యక్రమాలన్నీ కూడ కేటీఆర్ కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ కు, హరీష్ రావుకు కేసీఆర్ మంత్రి పదవులను కేటాయించారు.

కేటీఆర్ కు సీఎం పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయనే ప్రచారం విషయమై ఒకానొక సమయంలో కేసీఆర్ కూడ స్పందించారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ప్రకటించారు.

పలు మీడియా ఛానెల్స్ ఇంటర్వ్యూల్లో కూడ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడ కేసీఆర్ సీఎంగా కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పారు.

అయితే తాజాగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా అనే చర్చ కూడ లేకపోలేదు. కేసీఆర్ కొడుకుగా తనకు రాజకీయాల్లో చేరేందుకు సులభంగా అవకాశం దక్కింది. కానీ,తనకు పదవులు దక్కడానికి తన పనితీరే నిదర్శనమని కేటీఆర్ కొన్ని సందర్భాల్లో తేల్చి చెప్పారు.

మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన ముందున్న సవాళ్లను తాను అధిగమించినట్టుగా కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీలో కూడ చాలామంది సీనియర్లు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసే సమర్ధులు కూడ ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కేటీఆర్ సీఎం అవుతారని కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రైవేట్ సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు. అయితే అది ఈ ఏడాది జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే అందులో వాస్తవం లేదనే చర్చ కూడ లేకపోలేదు.  ఈ ప్రచారంపై టీఆర్ఎస్ నాయకత్వం నుండి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios