తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా వున్న జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది కేంద్రం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులోనే ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా వున్న జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది కేంద్రం. 1964 ఆగస్టు 2న గౌహతిలో జన్మించారు జస్టిస్ ఉజ్జల్ . న్యాయవాదిగా గౌహతి హైకోర్టులోనే ఆయన ప్రాక్టీస్ చేశారు.
