జస్టిస్ ఫర్ దిశపై రేప్ హత్య కేసులో నిందితులను 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు షాద్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

హైదరాబాద్: జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితుల నుండి సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్ పోలీసులు అభిప్రాయపడ్డారు.ఈ మేరకు పది రోజుల పాటు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కస్టడీ పిటిషన్‌లో పోలీసులు పలు విషయాలను ప్రస్తావించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Also read:Justice for Disha: నిందితుడికి ప్రాణాంతక వ్యాధి, ఆర్నెళ్లకోసారి..

జస్టిష్ ఫర్ దిశ హత్య కేసులో నిందితుల నుండి సమగ్రమైన సమాచారం కోసం పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టును కోరారు. నిందితులను రిమాండ్‌కు తరలించే సమయంలో వేలాది మంది పోలీస్‌స్టేషన్‌కు రావడంతో ఈ కేసు విషయంలో సమగ్రంగా దర్యాప్తు చేయలేకపోయినట్టుగా పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ కేసు విషయమై సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.

Also read:జగన్ కులం, మతంపై పవన్ వ్యాఖ్యలు: వైఎస్ జగన్ కౌంటర్

ఈ కేసులో కీలకమైన మొబైల్ ఫోన్ ‌ ఇంకా స్వాధీనం చేసుకోలేకపోయినట్టుగా పోలీసులు చెప్పారు. నిందితులను సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉన్నందున వారిని తమ కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టును కోరారు. జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళ సంఘాలు, యువత కోరుతున్నారు.