హైదరాబాద్:  సమాజంలో మృగాళ్లలా ప్రవర్తిస్తున్న కిరాతకులను బహిరంగంగా కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు పునరావృతం కావని  చినజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు.

Also read:వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య కేసు: నిందితులు వెనక్కి వచ్చి చూసి....

దిశ పై గ్యాంగ్ రేప్,హత్య కేసుపై చినజీయర్ స్వామి స్పందించారు. ఆదివారం నాడు ఆయన ఈ విషయమై స్పందించారు. నేరం రుజువైన నేరస్తులను వెంటనే బహిరంగంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ తరహా ఘటనలపై  విచారణ పేరుతో  ఏళ్ల తరబడి సంరక్షించడం సరైంది కాదన్నారు. ఇలాంటి వారిని ఏళ్లతరబడి సంరక్షించడం సమాజానికి నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంగ్లేయుల పాలనలో రూపొందించిన ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని చినజీయర్ స్వామి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.