Asianet News TeluguAsianet News Telugu

జస్టిస్ ఫర్ దిశ: మానవహక్కులంటూ కేసు వేసినవారిపై నెటిజన్ల మండిపాటు

దిశ రేప్, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై మానవ హక్కులంటూ కేసు వేసిన సామాజిక కార్యకర్తలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.న్యాయం జరిగినాక వచ్చి దానిలొ లొసుగులు కనిపెట్టి పబ్లిసిటీ వెతుక్కుంటారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Justice For Disha: Human rights activists trolled by Netizens
Author
Hyderabad, First Published Dec 7, 2019, 11:11 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసును ఊహించని విధంగా ముగించినటువంటి తెలంగాణ పోలీసులపై మానవ హక్కులంటూ కొందరు వ్యక్తులు కేసులు పెట్టారు. సంధ్య, దేవి అనే సామజిక వేత్తలతో పాటు విమల మోర్తాల, పద్మజ షా మరియు నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్ మూమెంట్స్ అధ్యక్షురాలు మీరా సంఘ్తమిత్ర ఇంకా కొందరు కలిసి ప్రజల మద్దతు అధికంగా ఉన్నటువంటి పోలీసులపై మానవహక్కుల ఉల్లంఘన అంటూ ఈ కేసులు వేసినట్లు సమాచారం.

ఈ కేసుల పేరుతో హడావుడి చేస్తున్న వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిపై నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. వీళ్ళు అన్యాయం జరిగినప్పుడు బయటకు రారు... వచ్చినా సమస్యను పరిష్కరించటానికి రారు. సమస్యను పెంచటానికి వస్తారు. న్యాయం జరిగినాక వచ్చి దానిలొ లొసుగులు కనిపెట్టి పబ్లిసిటీ వెతుక్కుంటారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అన్యాయం జరిగినప్పుడు ఎందుకు జరిగిందని వీళ్ళు రారు కానీ న్యాయం జరిగాకా వచ్చి నాలుకలాడిస్తారని ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పేరోజు దగ్గర్లో ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఒకవేళ వచ్చినా కులాలను బట్టి మతాలను బట్టి ప్రజల మధ్య కుంపట్లు పెడతారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

దేశం మొత్తం దిశ విషయంలో న్యాయం జరిగిందని తెలంగాణ పోలీసులను ప్రశంశిస్తుంటే వీరు మాత్రం కేసులంటూ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిన పర్లేదు కానీ ఆ నలుగురు క్రూరులకు మాత్రం న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే దిశ విషయంలో దేశం మొత్తం ఒక్కటై తెలంగాణ పోలీసులకు మద్దతు తెలుపుతున్న తరుణంలో వీరు పోలీసులపై కేసులు వేయటం పలు విమర్శలకు తావిస్తోంది. #AntiSocialActivists పేరుతో అని సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతుంది. 

కేసులు వేసిన వారి పేర్లు:

1. సజయ కె, ఇండిపెండెంట్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్
2. మీరా సంఘమిత్ర, నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్ (ఎన్ఎపిఎం)
3. ప్రొఫెసర్ పద్మజా షా, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
4. దేవి, సామాజిక, సామాజిక కార్యకర్త
5. ఝాన్సీ, ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యు)
6. విమల మోర్తాలా, మహిళా హక్కుల కార్యకర్త, రచయిత్రి
7. వి. సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యు)
8. విజయ భండారు, ప్రగతిశీల మహిళా రచయితల సంఘంట
9. ఆశాలత, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)
10. సయ్యద్ బిలాల్, మానవ హక్కుల వేదిక
11. సునీత అచ్యుత, రీసెర్చర్
12. వర్ష భార్గవి, బాలల హక్కుల కార్యకర్త
13. ఖలీదా ప్రవీణ్, సామాజిక కార్యకర్త
14. కనీజ్ ఫాతిమా, పౌరహక్కుల కార్యకర్త
15. సంజీవ్, మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్)

Follow Us:
Download App:
  • android
  • ios