హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్  పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. నాలుగు రోజుల పసికందు తల లభించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు రోడ్డుపై వెళ్తుండగా... చిన్నారి తల కనిపించడం గమనార్హం.

కాగా..జనాలు భయాందోళనకు గురయ్యారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి చిన్నారి తలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే పసికందు తల పడిఉన్న ప్రాంతం పక్కనే స్మశాన వాటిక ఉండడంతో అక్కడ పాతిపెట్టిన చిన్నారిని కుక్కలు లాక్కొని వచ్చుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
అయితే ఈ తల స్మశాన వాటిక నుంచి బయటికొచ్చిందా..? లేక ఎవరైనా దారుణానికి పాల్పడి రోడ్డుపై తలపడేశారా..? అనేది నిగ్గు తేల్చడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.