జూరాలకు పోటెత్తిన వరద: 18 గేట్లు ఎత్తివేత, 1.7 లక్షల క్యూసెక్కులు విడుదల

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు ఎగువ నుండి 1.6 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. జూరాల నుండి 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Jurala Project receives heavy inflow,18 Gates lifted

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని Jurala ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి 1.6 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుండి 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  Karnataka  రాష్ట్రంలోని కృఫ్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

Godavari నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. Krishna  పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడంతో వరద నీరరు ఎగువ నుండి జూరాలకు చేరుతుంది. వచ్చిన వరదను వచ్చినట్టుగానే జూరాల నుండి దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657, ప్రస్తుతం జూరాలలో 6.482 టీఎంసీల నీరుంది.  జూరాల నుండి విడుదల చేసిన వరద నీరు Srisailam ప్రాజెక్టుకు చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్లు కూడా ఎత్తారు. తుంగభద్ర నుండి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు వస్తుంది. 

ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లను రెండు రోజుల క్రితం ఎత్తారు.ఈ నెల 12న ఈ రెండు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.  దీంతో ఎగువ నుండి జూరాలకు  నీరు వస్తుంది. ఆల్మట్టి గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం 129.72 టీఎంసీలు. ప్రస్తుతం ఆల్మట్టిలో సుమారు 92 టీఎంసీలకు పైగా నీరుంది. నారాయణపూర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 37 టీఎంసీలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 33 టీఎంసీల నీరుంది.  ఎగువ నుండి ఈ రెండు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది. ఆల్మట్టికి 1,13 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు సుమారు 90వేల క్యూసెక్కుల నీరు వస్తుంది.ఈ వరద నీటిని ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.

also read:భద్రాచలం వద్ద 58 అడుగులకు చేరిన గోదావరి: ఎగువ నుండి 20 లక్షల క్యూసెక్కులు, నీట మునిగిన రోడ్లు

గత ఏడాది జూరాల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు జూలై 11న వరద నీరు ప్రారంభమైన విషయం తెలిసిందే.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్నప్రాజెక్టులు సాగు, తాగు నీరు అందిస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు సమృద్దిగా కురవడం లేదు. గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే గోదావరి నది నుండి లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులకు వచ్చి చేరుతుంది. అంతేకాదు లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం నుండి సముద్రంలో కలుస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios