భద్రాచలం వద్ద 58 అడుగులకు చేరిన గోదావరి: ఎగువ నుండి 20 లక్షల క్యూసెక్కులు, నీట మునిగిన రోడ్లు
భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పోటెత్తింది. ఇప్పటికే భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ నుండి గోదావరికి 20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని సుమారు 5 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
భద్రాచలం: గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు పరివాహ ప్రాంతాల్లో కరుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తింది. Bhadrachalam వద్ద Godavari నది 58 అడుగులకు చేరుకుంది. ఎగువ నుండి 20 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏడు మండలాలకు ఏడుగురు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు కలెక్టర్ Anudeep.
భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తడంతో Ramalayam Temple స్నానాలగట్టు నిట మునిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం నుండి ఏజన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. భద్రాచలం దిగువన ఉన్న Andhra Pradesh రాష్ట్రంలో కూడా గోదావరి నదికి వరద మరింత పోటెత్తింది.
kothagudem మినహా అన్ని రోడ్లు నీటిలో మునిగాయి. మరో వైపు భద్రాచలం నుండి Chhattisgarh వైపు వెళ్లే జాతీయ రహదారి నీటిలోనే ఉంది. దీంతో రాకపోకలను నిలిపివేశారు.భద్రాచలం జిల్లాలోని 56 ముంపు గ్రామాలకు చెందిన ఐదు వేల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరికి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ పునరావాస కేంద్రాల్లో సుమారు 4600 మందిని పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద 65 అడుగులకు గోదావరి నది చేరితే భద్రాచలం వద్ద రోడ్లు మునిగిపోయే అవకాశం ఉంది.
భద్రాచలానికి మూడు వైపులా ఉన్న రోడ్లు తెగిపోయాయి. కొత్తగూడెం నుండి భద్రాచలానికి వెళ్లే రోడ్డు మాత్రం ప్రస్తుతం నీరు లేకుండా ఉంది. గోదావరికి వరద మరింత పెరగే ఈ రోడ్డు నుండి కూడా భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే భద్రాచలం ఐలాండ్ గా మారే అవకాశం ఉంది. దీంతో భద్రాచలం జిల్లా వాసులను అధికారులు అప్రమత్తం చేశారు.
also read:కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు:పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు
భద్రాచలం జిల్లాలోని చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో తాలిపేరు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 38 వేల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది 15.20 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ధవళేశ్వరం నుండి సుమారు 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.