కోమటిరెడ్డితో జూపల్లి, పొంగులేటి భేటీ: కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానం

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డితో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు భేటీ అయ్యారు.

Jupally Krishna Rao And  Ponguleti Srinivas Reddy Meeting With  Komatireddy Rajagopal Reddy lns

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు,  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు  మంగళవారంనాడు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో  చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని  కోరారు.  అయితే ఇప్పుడే పార్టీ మార్పుపై  నిర్ణయం తీసుకోలేనని రాజగోపాల్ రెడ్డి  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  చెప్పారని సమాచారం.

బీజేపీ  తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న  బండి సంజయ్ ను మార్చాలని  ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టీ నాయకత్వాన్ని కోరారు. అయితే  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తప్పించబోమని  ఆ పార్టీ నేతలు  తొలుత ప్రకటించారు. అయితే  లోక్ సభ ఎన్నికలు,  తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలను  పురస్కరించుకొని  పార్టీలో సంస్థాగత మార్పులకు  బీజేపీ నాయకత్వం శ్రీకారం చుట్టింది. 

కర్ణాటక  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కొందరు కాంగ్రెస్ నేతలు  సంప్రదింపులు జరిపారు.   
 ఈ నెల  2వ తేదీన కాంగ్రెస్ పార్టీలో  ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చేరారు.

రానున్న రోజుల్లో మరికొందరు  నేతలు  కూడ  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.  పార్టీనుండి వెళ్లిపోయిన నేతలను ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ తరుణంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios