ప్రజా ప్రతినిధుల పిల్లలున్నారా?:హైద్రాబాద్ అమ్నేషియా పబ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు

హైద్రాబాద్ నగరంలోని అమ్నేషియా పబ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన కేసులో ప్రజా ప్రతినిధుల పిల్లలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ విషయాన్ని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. అయితే బాలికపై వేధింపులకు పాల్పడిన వారిలో ప్రజా ప్రతినిధుల పిల్లలున్నారా లేదా అనే విషయమై తేల్చలేదు.

Jubilee hills Police Found key Information In Amnesia Pub Case

హైదరాబాద్:నగరంలోని Amnesia పబ్ కేసులో  Jubilee hills పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.ఈ కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. Minor girl పై వేధింపులకు పాల్పడిన కేసులో  ప్రజా ప్రతినిధుల పిల్లలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. ఈ కేసుతో ప్రజా ప్రతినిధుల పిల్లలకు సంబంధాలున్నాయా లేవా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా ఆ చానెల్ వివరించింది.

గత నెల 28వ తేదీన అమ్నేషియా పబ్ లో బర్త్ డే పార్టీ కోసం కొందరు యువకులు  బుక్ చేశారు. మధ్యాహ్నం పూట పబ్ కు వచ్చిన తర్వాత సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో బాధిత బాలికతో పాటు కొందరు యువకులు కారులో బయటకు వెళ్లారు. కారులోనే యువతిపై యువకులు అసభ్యంగా ప్రవర్తించారని ఆమెపై వేధింపులకు దిగినట్టుగా బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ నెల 2వ తేదీన  ఓ యువకుడితో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు. CCTV పుటేజీ ఆధారంగా పోలీసులు ఈ యువకుడిని అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. అరెస్ట్ చేసిన యువకుడిని విచారించిన సమయంలో పోలీసులు కీలక విషయాలు రాబట్టారని  ఎన్టీవీ ప్రసారం చేసింది. బాలికను వేధించిన  సమయంలో ఓ కార్పోరేషన్ చైర్మెన్, ఎమ్మెల్యేల కొడుకులు కూడా ఉన్నారని గుర్తించారని ఆ చానెల్ తెలిపింది.

అయితే  బాలికను వేధించినవారిలో వీరిద్దరూ కూడా ఉన్నారా లేదా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  బాలికను కారులో వేధించిన సమయంలో కారులో ఆరుగురు యువకులున్నారని సమాచారం. అయితే ఈ ఆరుగురు ఎవరెవరున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

also read:హైద్రాబాద్‌లో పబ్ నుండి బాలిక కిడ్నాప్: ఒకరి అరెస్ట్, కారు సీజ్

 బాలిక ఒంటిపై ఉన్న గాయాలను చూసిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. అయితే ఈ విషయమై బాలిక తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ఈ నెల 2వ  తేదీ మధ్యాహ్నం ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.పార్టీ కోసం మైనర్లను లోనికి ప్రవేశించడానికి పబ్ యాజమాన్యం ఎలా అనుమతించింది అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

హైద్రాబాద్ నగరంలో పబ్ లు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయని గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. మైనర్లను పబ్ లోకి ఎలా అనుమతించారనే విషయమై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పబ్ ల వ్యవహరశైలిపై గతంలో తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని కూడా పోలీసులు పబ్ ల నిర్వాహకులను కోరారు. అయితే పబ్ ల నిర్వాహకులు మాత్రం నిబంధనలను పాటించడం లేదని తాజాగా చోటు చేసుకున్న ఘటన  రుజువు చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios