హైదరాబాద్: కార్వీ కన్సెల్టెన్సీ సంస్థపై హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసలు ఆదివారం నాడు  కేసు నమోదు చేశారు.

ఓ పవర్ ప్లాంట్ షేర్ల విషయంలో గోల్ మాల్ చోటు చేసుకొన్నట్టుగా ఆ కంపెనీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై క్వారీ కన్సల్టెన్సీపై పవర్ ప్లాంట్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద కార్వీ సంస్థ ఛైర్మెన్ పార్థసారథికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయమై ఆయనను జూబ్లీహిల్స్ పోలీసులు ఇవాళ విచారించారు. 
పవర్ ప్లాంట్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

షేర్ల గోల్ మాల్ విషయంలో  కార్వీ సంస్థ ప్రమేయం ఉందని పవర్ ప్లాంట్ ప్రతినిధులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కార్వీ సంస్థ పై సీతారామరాజు ఫిర్యాదు చేశారు. కార్వీ రామకృష్ణ, విజయ్ కుమార్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్వీ రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. విజయ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గతంలోనే సెబీ కూడ కార్వీ సంస్థపై గతంలోనే  నిషేధించిన విషయం తెలిసిందే.స్టాక్ బ్రోకింగ్ కార్యక్రమాలను నిర్వహించకూడదని  సెబీ కార్వీపై నిషేధం విధించింది. గతంలో కార్వీ సంస్థ చేసిన కార్యక్రమాలపై సెబీ నిషేధం విధించింది.తాజాగా చోటు చేసుకొన్న కేసు నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు దారితీస్తోందోననే చర్చ సాగుతోంది.