పవన్ ఫ్యాన్స్ మీద తెలంగాణ జర్నలిస్టులు సీరియస్

పవన్ ఫ్యాన్స్ మీద తెలంగాణ జర్నలిస్టులు సీరియస్

వపన్ ఫ్యాన్స్ మీడియాపై దాడికి దిగడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (143) ఖండించింది. ఈమేరకు సంఘం అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ ఒక ప్రకటన వెలువరించారు. ఆ ప్రకటన కింద ఉంది చదవండి.

ఫిల్మ్ ఛాంబర్ వద్ద మీడియా వాహనాలపై పవన్ అభిమానుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడులతో మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళువేయొచ్చని వేయొచ్చని భావిస్తున్నారేమో ఇది కరెక్ట్ కాదని టి యు డబ్ల్యూ జె హెచ్చరిస్తోంది. మీడియా పట్ల మిత్ర ధోరణితో కాకుండా ఇలా ప్రవర్తిస్తే జర్నలిస్ట్ లు చూస్తూ ఊరుకోరనే  విషయాన్ని పవన్ గుర్తించాలి.
- అల్లం నారాయణ
, క్రాంతి

ఇదిలా ఉంటే... తెలుగు రాష్ట్రాల్లో వపన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. పవన్ తల్లిని అవమానకరంగా తిట్టడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియా సంస్థలపై పవన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ దాడులకు దిగుతున్నారు. పవన్ తల్లిని తిట్టిన శ్రీరెడ్డి వెనుక మీడియా సంస్థల యజమానులు ఉన్నారని పవన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోపించిన టివి చానెళ్లను పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు.

హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పవన్ ఫ్యాన్స్ అక్కడే ఉన్న ఎబిఎన్ అనే టివి ఛానెల్ కార్లు, ఓబి వ్యాన్ అద్దాలు పగలగొట్ట నిరసన తెలిపారు. అంతేకాదు టివి9 చానెల్ ఆఫీసు మీద కూడా దాడి చేస్తారన్న ముందస్తు సమాచారం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే భారీ బలగాలను టివి9 ఆఫీసు చుట్టూ మొహరించారు. దీంతో మీడియా అధిపతులతోపాటు జర్నలిస్టు వర్గాల్లో పవన్ ఫ్యాన్స్ వైఖరి చర్చనీయాంశమైంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page