కేసిఆర్ సర్కారుపై తెలంగాణ జర్నలిస్టులు గరం గరం

కేసిఆర్ సర్కారుపై తెలంగాణ జర్నలిస్టులు గరం గరం

తెలంగాణ జర్నలిస్టులు కేసిఆర్ సర్కారుపై ఆగ్రహంగా ఉన్నారు. పాలకులు కేవలం మాటలతోనే కడుపునింపే ప్రయత్నం చేస్తున్నారని గుర్రుగా ఉన్నారు. సర్కారుపై గట్టిగా కొట్లాట పెట్టుకునేందుకు తయారయ్యారు. జర్నలిస్టుల హక్కుల సాధనకై ఈ నెల 28న  తలపెట్టిన "జర్నలిస్టుల గర్జన'ను జయప్రదం చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూ జె (ఐజెయు ) మహబూబాబాద్ జిల్లాలో పోస్టర్ ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు  చిత్తనూరి శ్రీనివాస్ స్థానిక ఆర్&బి గెస్టుహౌస్ లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాడిపెల్లి మధు, ఉపాధ్యక్షులు గందశిరి రవి , కోశాధికారి గాడిపెల్లి శ్రీహరి , ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి రంగాచౌదరి, జిల్లా నాయకులు గుండ్ల శ్రీనివాస్, పద్మం మహేష్, ఉమ్మగాని మదు, జక్కుల సతీష్, మలిశెట్టి వేణు, బోనగిరి శ్రీనివాస్, కేదాసు విజయ్, కిరణ్, మహేందర్, గాండ్ల కిరణ్, అయోధ్య రామయ్య, రామరాజు ప్రవీణ్, జమ్ముల వేణుమాధవ్, బేతమల్లు సహదేవ్ పాల్గొన్నారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో గర్జన సభకు హాజరై జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా నిరసన తెలపాలని  ఈ సందర్భంగ  జర్నలిస్టు నేతలు పిలుపునిచ్చారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page