రామన్నపేట మండలంలో విలేకరిగా పనిచేస్తున్న సలివేరు లింగమయ్య రెండో కూతురు కరిష్మా. సలివేరు లింగమయ్య ప్రమాదవశాత్తు చనిపోవడంతో అతని కుటుంబం అనాథగా మారింది. అతని కొడుకు కూడా మృతి చెందడంతో.., అయన భార్య అండాలు, ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. దీంతో రెండో కుమార్తె కరిష్మాకు ఉద్యోగం కల్పిస్తానని గతంలో మాట ఇచ్చారు.
హైదరాబాద్ : telangana ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి KTR మాట నిలబెట్టుకున్నారు. కరిష్మాకు ఉద్యోగం ఇచ్చారు. రామన్నపేట మండలంలో విలేకరిగా పనిచేస్తున్న Saliver Lingamayya రెండో కూతురు కరిష్మా. సలివేరు లింగమయ్య ప్రమాదవశాత్తు చనిపోవడంతో అతని కుటుంబం అనాథగా మారింది. అతని కొడుకు కూడా మృతి చెందడంతో.., అయన భార్య అండాలు, ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. దీంతో రెండో కుమార్తె కరిష్మాకు job కల్పిస్తానని గతంలో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు కేటీఆర్.
కాగా, జనవరి 11న telangana ఐటీ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి KTR మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. పుట్టు మూగ అయిన పంజాబ్ Chess Champion మాలిక హాండాకు మంత్రి కేటీఆర్ వ్యక్తిగతంగా 15 లక్షల Financial assistance అందించారు. అనేక జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించినా.. వైఫల్యం కారణంగా Punjab ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడం లేదని ఆమె ట్విటర్ ద్వారా ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చూసిన కేటీఆర్ స్పందించారు. ఆమెను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు దివ్యాంగ సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ, ఇతర అధికారిణులను పంపించి మాలికను సోమవారం జలంధర్ నుంచి ప్రగతి భవన్ లోని తన కార్యాలయానికి Malika Handaను పిలిపించి చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆమెకు ల్యాప్ టాప్ నూ బహూకరించారు. కేంద్రం నుంచీ సాయం అందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కోరారు.
అయితే, మంత్రి కేటీఆర్ తరచుగా ఇలాంటి వాటికి స్పందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఉన్నాయి. నిరుడు జూలైలో ఆత్మహత్యకు పాల్పడిన ఐఏఎస్ అభ్యర్ధి ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఆదుకున్నారు. వారికి ప్రభుత్వం తరపున 2.50 లక్షల ఆర్ధిక సాయంతో పాటు షాద్ నగర్‌లో ఓ డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేస్తామని ప్రకటించారు.
గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆదుకున్నారు కేటీఆర్. అత్యంత పేదరిక నేపథ్యం నుంచి ఢిల్లీలోని ప్రముఖ లేడి శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, ఐశ్వర్య రెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
అయితే లాక్‌డౌన్ సమయంలో తన కాలేజీ హాస్టల్ ఫీజులతోపాటు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు అవసరమైన లాప్‌టాప్ కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో మనస్తాపంతో ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఐశ్వర్య కుటుంబాన్ని ప్రగతి భవన్ కి పిలిపించి 2 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
షాద్ నగర్‌లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. పేదరికాన్ని జయించి దేశంలోనే ప్రముఖ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న కూతురిని కోల్పోవడం అత్యంత బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
