Asianet News TeluguAsianet News Telugu

చారణా ఉద్యోగాలు.. బారణా షరతులు

సీఎం గారు మిమ్నల్ని ఉద్యోగం అడిగితే ఉన్న గోచి ఊడగొడుతున్నారేంటీ సర్... ఐఏఎస్ పరీక్షలకే లేని పర్సెంటేజీ మార్కులు మాకెందుకు పెడుతున్నారు సర్.  ప్రత్యేక ఉద్యమానికి పరీక్షలు ఎగ్గొట్టి వచ్చిన్నప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు సర్. మిలియన్ మార్చ్ లో కాళ్లు విరగ్గొట్టుకున్నప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగలేదేంటీ సర్...

పర్సెంటేజీ అంటే మీరు ప్రాజెక్టుల్లో మాట్లాడుకునే పర్సెంటీజే కాదు సర్. పరీక్షలు రాస్తే వచ్చేది... ఉద్యమాల్లో పాల్గొని పర్సెంటేజీలు, పస్టు క్లాసు మార్కులు పట్టించుకోలేదు సర్. తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయనుకున్నాం కానీ, ఉన్న సర్టిఫికేట్ లు కూడా పనికిరాకుండా పోతాయి అనుకోలేదు సర్.

ఉద్యమంలో మేం తిన్న లాఠీ దెబ్బలకు ఒక్కో మార్కుకు వేసుకున్న మా మార్కులు 98 శాతం దాటుతాయి సర్.

job aspirants frustration on tspsc notification rules

సీఎం గారు మిమ్నల్ని ఉద్యోగం అడిగితే ఉన్న గోచి ఊడగొడుతున్నారేంటీ సర్... ఐఏఎస్ పరీక్షలకే లేని పర్సెంటేజీ మార్కులు మాకెందుకు పెడుతున్నారు సర్.  

ప్రత్యేక ఉద్యమానికి పరీక్షలు ఎగ్గొట్టి వచ్చిన్నప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు సర్.

మిలియన్ మార్చ్ లో కాళ్లు విరగ్గొట్టుకున్నప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగలేదేంటీ సర్...


సాగరహారంలో లాఠీ దెబ్బలు తిన్నప్పుడు ఎంత పర్సెంటేజీ రావాలో చెప్పలేదేంటీ సర్...

 

జైల్  భరోలో పాల్గొని కోర్టులు చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకున్న అర్హత ఏంటీ అని అడగలేదేంటీ సర్...

 

ఉద్యమంలో మేం తిన్న లాఠీ దెబ్బలకు ఒక్కో మార్కుకు వేసుకున్న మా మార్కులు 98 శాతం దాటుతాయి సర్.

 

మేం మీ సీఎం పదవిని అడగటం లేదు సర్...

మీ కొడుకు మంత్రి పదవి ఎగరేసుకపోవాలనుకోవడం లేదు సర్..

మీ కూతరు ఎంపీ పదవికి ఎసరు పెట్టాలనుకోవడం లేదు సర్.

కనీసం మమల్ని మా పరీక్ష అయినా రాయనివ్వమని వేడుకుంటున్నాం సర్.

job aspirants frustration on tspsc notification rules

బీఎడ్ చేసి... డీఎస్సీ కోసం వేచి చూసి..చూసి..  టెట్ కోసం కోచింగ్ లకు వేల రూపాయిలు ఖర్చు పెట్టి... ఇంటికి వెళ్లలేక... హైదరాబాద్ లో ఖర్చులు భరించలేక ఉద్యోగం కోసం అడిగితే ఉన్న గోచి కూడా ఊడగొట్టకండి సర్. కనీసం మా పరీక్ష అయినా మమ్మల్ని రాయనీయండి సర్.

 

మీరు వ్యవసాయం చేస్తే కోట్లు వస్తున్నాయి. అందుకే మీ కొడుకును మీరు ఆంధ్రా కార్పొరేట్ స్కూల్ లో చదివించారు. మీ కూతరును ఫారిన్ యూనివర్సిటీలో చేర్పించారు.

కానీ,  మా  నాన్న సాగు చేసే అప్పులే మిగులుతున్నాయి.  అందుకే ఆయన మమల్ని సర్కారు బళ్లోనే చదివించారు. బ్లాక్ బోర్డులే సరిగా లేని చోట చదవుకున్న మాకు ఫస్టు క్లాస్ మార్కులంటే ఎట్లా వస్తాయి సర్.

 

పర్సెంటేజీ అంటే మీరు ప్రాజెక్టుల్లో మాట్లాడుకునే పర్సెంటీజే కాదు సర్. పరీక్షలు రాస్తే వచ్చేది... ఉద్యమాల్లో పాల్గొని పర్సెంటేజీలు, పస్టు క్లాసు మార్కులు పట్టించుకోలేదు సర్. తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయనుకున్నాం కానీ, ఉన్న సర్టిఫికేట్ లు కూడా పనికిరాకుండా పోతాయి అనుకోలేదు సర్.

 

పరాయోడి పాలనలో లేని షరతులు మన పాలనలో ఎందుకు సర్...

పరీక్షలన్నీ బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నందుకా... ?

వద్దురా కొడుకా అన్నా వినకుండా తెలంగాణ నినాదాలు చేస్తూ లాఠీ దెబ్బలు తిన్నందుకా...?  ‘

కారు’కే జై కొట్టి మిమ్నల్నే సీఎం సీటులో కూర్చొబెట్టినందుకా...?

 

జర సోచాయించండి సర్...


ఇట్లు

ఓ తెలంగాణ నిరుద్యోగి

 

 

( తెలంగాణ లో  7 వేల పై చిలుకు గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినా సవాలక్ష షరుతులు విధించడం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలో సర్కారు పెడుతున్న నిబంధనలపై నిరుద్యోగ అభ్యర్థులు తమ వేదనను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఇవి వైరల్ గా మారాయి. వీటిని చూసైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి. )

 

Follow Us:
Download App:
  • android
  • ios