నో పార్కింగ్‌లో కారు.. వద్దన్న సెక్యూూరిటీ గార్డ్‌ని చితకబాదిన జేఎన్టీయూ ప్రొఫెసర్

jntu professor attack on security guard
Highlights

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నో పార్కింగ్ ప్లేస్‌లో కారు పెట్టొద్దన్నందుకు సెక్యూరిటీ గార్డును చితకబాదాడు ఓ ప్రొఫెసర్. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డవ్వడంతో.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నో పార్కింగ్ ప్లేస్‌లో కారు పెట్టొద్దన్నందుకు సెక్యూరిటీ గార్డును చితకబాదాడు ఓ ప్రొఫెసర్.. హైదరాబాద్ జేఎన్టీయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. రోజూ లాగానే కార్యాలయానికి కారులో వచ్చాడు.

అయితే కారు పార్కింగ్ చేసే క్రమంలో నో పార్కింగ్ వద్ద పెట్టాడు. అలా పెట్టొద్దు అన్నాడు అక్కడి సెక్యూరిటీ గార్డు.. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది.. గార్డువి నాకే ఎదురుచెబుతావా అంటూ ఫైరయ్యాడు. అక్కడితే ఆగకుండా అతని మీద చేయిచేసుకున్నాడు. ఆఫీసు లోపలికి అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లాడు.. గార్డు సారీ చెప్పినా వదల్లేదు.. తోటి ఉద్యోగులు అడ్డుకుని సెక్యూరిటీ గార్డుని దూరంగా లాక్కెళ్లారు.  ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డవ్వడంతో.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

loader