వికలాంగులకు శిక్షణ , ఉపాధి కల్పించే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జియో తెలంగాణ చేపట్టింది. ‘జియో అసోసియేట్’ ప్రోగ్రామ్‌లో భాగంగా కంపెనీతో కలిసి సొంతంగా ఆర్జించేందుకు జియో అవకాశాన్ని కల్పిస్తోంది.

వికలాంగులకు శిక్షణ , ఉపాధి కల్పించే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జియో తెలంగాణ చేపట్టింది. ‘జియో అసోసియేట్’ ప్రోగ్రామ్‌లో భాగంగా కంపెనీతో కలిసి సొంతంగా ఆర్జించేందుకు జియో అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రతి నెలా రూ. 16,000 వరకు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వికలాంగ యువ మహిళా/పురుష అభ్యర్థులకు హైదరాబాద్ వ్యాప్తంగా జియో లో ఇటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి. 

వారు చేయాల్సిందల్లా స్మార్ట్ ఫోన్‌ని ఆపరేట్ చేయగలగడం. రిలయన్స్ స్టోర్‌ల వద్ద కనీసం 8 గంటలు గడపడం. ఒక 4G స్మార్ట్ ఫోన్ మరియు రూ. 1000 కనీస పెట్టుబడితో వినియోగదారులకు జియో సేవలను అందించడం ద్వారా స్యయంగా వ్యాపారం నిర్వహించుకుందుకు వీలుంటుంది. వారి సామర్థ్యం మరియు పని పట్ల వారికున్న అంకితభావం తోటివారి మరియు కస్టమర్ల గౌరవాన్ని పొందాయి.

గౌరవప్రదమైన జీవితాన్ని గడపడమే కాకుండా, వారి కుటుంబాల అవసరాలను తీర్చడానికి తగినంతగా సంపాదిస్తున్నారు. 'జియో అసోసియేట్' ప్రోగ్రాం లో పాల్గొనేందుకు ఆసక్తి గల అభ్యర్థులు రామంతాపూర్ (శుభం గార్డెన్స్ పక్కన), కూకట్ పల్లి (బీజేపీ ఆఫీస్ ఎదురుగా), అత్తాపూర్ (పిల్లర్ నం.150) వద్ద గల జియో కార్యాలయంలో మేనేజర్‌ని సంప్రదించవచ్చు.