హైదరాబాద్: హైద్రాబాద్ సరూర్‌నగర్‌లో  ఆదివారం నాడు జిమ్ ట్రైనర్ అవినాష్ పక్కింటి కుక్కుపై కాల్పులు జరిపినట్టుగా కుక్క యజమాని ఆరోపిస్తున్నాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సరూర్‌నగర్ కట్టకు సమీపంలోని దండి ప్రాంతంలో ఉంటున్న జిమ్ ట్రైనర్ అవినాష్ పక్కింటి కుక్కపై కాల్పులు జరపడంతో ఆ కుక్క మృతి చెందినట్టుగా కుక్క యజమాని చెప్పారు.

కాల్పులు జరిపిన సమయంలో తాము చూసినట్టుగా కుక్క యజమాని చెప్పారు.  అయితే  అతని వద్ద ఉన్న ఆయుధం లైసెన్స్‌డ్ వెపనేనా కాదా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు కుక్కపై అవినాష్ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.