ప్రేమోన్మాది ఘాతుకం: గొంతు కోసి విద్యార్థిని హత్య

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 31, Aug 2018, 8:20 AM IST
jilted lover kills girl in Sangareddy district
Highlights

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం గ్రామంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో పదో తరగతి విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం గ్రామంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో పదో తరగతి విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తారకేశ్వరరావు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం వచ్చాడు. ఆ ప్రాంతంలోని వినాయకనగర్‌లో ఉంటూ స్థానిక పరిశ్రమలో పనిచేస్తున్నారు. 

వారి ఇంటికి ఎదురుగా మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తారకేశ్వరరావు కూతురు నికిత (17) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రెండేళ్లుగా నికిత పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో మహారాష్ట్ర కుటుంబానికి చెందిన బీటెక్‌ సెకండియర్‌ విద్యార్థి అరవింద్‌ అలియాస్‌ సోను వెంటపడి వేధిస్తూ వచ్చాడు. 

గురువారం సాయంత్రం నికిత స్కూల్‌ నుంచి రాగానే సోను ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతుకోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత బయటకు వచ్చిసోను తీరిగ్గా ఇంటి బయట కూర్చున్నాడు. 
స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతణ్ని వారికి అప్పగించారు. రక్తపు మడుగులో పడి ఉన్న నికితను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

loader