ప్రేమోన్మాది యాసిడ్ దాడి: ఇద్దరు అమ్మాయిలు ఆస్పత్రిపాలు

Jilted lover attacks with acid on a girl
Highlights

రాజధాని నగరం హైదరాబాదుకు సమీపంలోని హయత్ నగర్ లో బుధవారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదుకు సమీపంలోని హయత్ నగర్ లో బుధవారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రేయసిపై, ఆమె స్నేహితురాలిపై యాసిడ్ దాడి చేశాడు. 

యాసిడ్ గాఢత తక్కువగా ఉండడం వల్ల వారికి ప్రాణాపాయం తప్పింది. హయత్ నగర్ ప్రాంతానికి చెందిన శంకర్, ఝాన్సీలు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

ఝాన్సీ హైదరాబాదులోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తోంది. కొద్ది రోజుల కిందట ఝాన్సీకి అదే పెట్రోల్ బంకులో పనిచేసే రమ్యతో పరిచయం ఏర్పడింది. 

రమ్యతో స్నేహం చేస్తున్నప్పటి నుంచి తనను ఝాన్సీ పట్టించుకోవడం లేదని, రమ్య తనపై చెడుగా చెప్పిందని భావించి శకర్ ఇద్దరిపై కక్ష పెంచుకున్నాడు. 

ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం శంకర్ బుధవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలపై బాత్రూంలు శుభ్రం చేయడానికి వాడే యాసిడ్ తో దాడి చేశాడు. గాయాల పాలైన ఇద్దరు అమ్మాయిలు అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

loader