దసరా రోజున యధావిధిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం: కేసీఆర్

దసరా రోజున టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం యధావిధిగా ఉంటుందని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీపై తీర్మానం కోసం దసరా రోజున ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ తో ఈ సమావేశానికి సంబంధం లేదని కేసీఆర్ 
ప్రకటిచారు. 

TRS To Conduct meeting For launh national party on october 5

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ తో సంబంధం లేకుండా ఈ నెల 5వ తేదీన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ఉంటుందని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. దసరా రోజున  ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం యధావిధిగా నిర్వహించనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం  నాడు టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల  చేసింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించే  విషయమై పార్టీ నేతల్లో అనుమానాలు నెలకొన్నాయి. దీంతో టీఆర్ఎస్ అగ్ర నేతలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఎన్నికల  షెడ్యూల్ ప్రకటించినా కూడా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందుల లేవని న్యాయ నిపుణులు పార్టీ నేతలకు తెలిపారు. దీంతో ఎల్లుండి సమావేశం యధావిధిగా జరుగుతుందని టీఆర్ఎస్ తెలిపింది. 

ఈ నెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు  తెలంగాణ భవన్ ఈ సమావేశం నిర్వహంచనున్నారు  జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు.  ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా  మార్చాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది. ఈ మేరకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయమై ఈ నెల 5వ తేదీన నిర్వహించే సమావేశంలో తీర్మానం చేయనున్నారు. టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ఈ తీర్మానానికి అనుకూలంగా తీర్మానం చేయనున్నారు.ఈ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఈ నెల 6వ తేదీన  అందజేయనుంది. 

also read:నేడు హైదరాబాద్ టీఆర్ఎస్ జనరల్ ‌బాడీ సమావేశం.. జాతీయ పార్టీపై చర్చ..!

జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి జెండా, ఎజెండాపై కేసీఆర్ గత కొంతకాలంగా కసరత్తు  నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ ఈ విషయమై ముఖ్య నేతలతో చర్చించారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా అడ్డుకొంటామని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన నేతలు, సీఎంలతో కేసీఆర్ చర్చలు నిర్వహిస్తున్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా  కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.గత మాసంలో బీహర్ సీఎం నితీష్ కుమార్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ  ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో నితీష్ కుమార్ భేటీ అయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios