Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఓ లెజెండ్.. తెలంగాణలో పోరాటం చూశాం, దేశంలోనూ గెలుస్తారు : కుమారస్వామి

తెలంగాణ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి. కేసీఆర్ ఒక లెజండరీ లీడర్ అని తెలంగాణలో కేసీఆర్ చేసిన పోరాటాన్ని అందరూ చూశారని కుమారస్వామి గుర్తుచేశారు.

jds leader kumaraswamy praises telangana cm kcr
Author
First Published Oct 5, 2022, 8:40 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి. హైదరాబాద్‌లో కేసీఆర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక లెజండరీ లీడర్ అన్నారు. దేశం కోసం ఎలాంటి స్వార్థం లేకుండా కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా విస్తరించారని కుమారస్వామి కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని.. బీజేపీకి గట్టి సమాధానం చెప్పేందుకు నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. దళితులు, రైతుల పట్ల కేసీఆర్‌కు గొప్ప కమిట్‌మెంట్ వుందని ప్రశంసించారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన పోరాటాన్ని అందరూ చూశారని కుమారస్వామి గుర్తుచేశారు. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ విజయం సాధించాలని కుమారస్వామి ఆకాంక్షించారు. 

ALso REad:కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన... జాతీయ నేతలతో గులాబీ దళపతి (ఫోటోలు)

తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ మాట్లాడుతూ.. బీజేపీ ఓటమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోందని.. బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలని తిరుమావళవన్ పిలుపునిచ్చారు. రైతు బంధు, దళిత బంధు విప్లవాత్మక పథకాలని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటి వరకు తెలంగాణ కోసం పనిచేశారని.. ఇకపై దేశం కోసం పనిచేస్తారని తిరుమావళవన్ అన్నారు. కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ అని ఆయన చెప్పారు. 

అంతకుముందు తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం కష్టపడదామని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కొత్త జాతీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. రాష్ట్రాలు, దేశం అభివృద్ధి చెందితేనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని.. దేశంలో ఇంకా కుల, లింగ వివక్ష కొనసాగుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, జపాన్, మలేషయా అద్భుత విజయాలు సాధించాయని కేసీఆర్ గుర్తుచేశారు. 

దళిత బంధు, రైతు బంధును చూసి ఆశ్చర్యపోతున్నారని.. రాష్ట్రంలో 17 లక్షల 50 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామన్నారు. జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నామని.. దేశ ప్రజల సమస్యలే ఎజెండాగా జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. అఖిలేష్, తేజస్వీ యాదవ్ హైదరాబాద్‌కు వస్తామన్నారని.. తానే వద్దన్నానని కేసీఆర్ తెలిపారు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం జలదృశ్యంలో మనం ప్రారంభమయ్యామని సీఎం గుర్తుచేసుకున్నారు. సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ నష్టపోయిందని.. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 

ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయని పక్కా రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని... ఒక దీక్షలా చేశాము కాబట్టే ఇది సాధ్యమైందని కేసీఆర్ పేర్కొన్నారు. దేశాన్ని ఏలిన పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని సీఎం అన్నారు. రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఒక ఆట అని.. టీఆర్ఎస్‌కు మాత్రం రాజకీయాలు ఒక టాస్క్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం దాదాపు లక్ష అని.. ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం లక్షా 78 వేలని సీఎం అన్నారు. తాను సీఎంగా వుంటూనే దేశం మొత్తం పర్యటిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. మొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మన జాతీయ పార్టీకి అనుబంధ రైతు సంఘం మహారాష్ట్ర నుంచే మొదలు కాబోతోందని సీఎం వెల్లడించారు. మనతో కలిసి వచ్చేందుకు అనేక పార్టీ నేతలు ముందుకొస్తున్నాని కేసీఆర్ పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios