పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసును చేధించే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే ప్రధాన నిందితుడు రాకేష్ ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా ఈ హత్యకు సంబంధించి..  ఓ సినీనటుడుతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అంజిరెడ్డి అనే వ్యక్తి జయరాం హత్యను కళ్లారా చూసినప్పటికీ పోలీసులకు సమాచారమివ్వలేదని, అలాగే కమెడియన్ సూర్యప్రసాద్ తోపాటు కిషోర్ అనే మరో వ్యక్తికి జయరాం హత్య గురించి ముందే తెలిసినప్పటికీ వారు కూడా పోలీసులకు సమాచారమివ్వలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

ఇటీవల పారిశ్రామిక వేత్త జయరాంని రాకేష్ అనే వ్యక్తి డబ్బు కోసం హైదరాబాద్ లో హత్య చేసి.. జగ్గయ్యపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా నమ్మించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.