జయలలిత మృతి తర్వాత తమిళనాట రాజకీయ డ్రామా రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. అన్నా డీఎంకే చీలిపోయింది.

 

పన్నీరు సెల్వం కొత్త కుంపటి పెట్టుకుంటారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ లోపే జయ మేనకోడలు దీప తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు.అయితే ఇది రాజకీయ పార్టీ కాదని వివరణ ఇచ్చారు.

 

అమ్మ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... జీఆర్ అమ్మ దీప పెరవై అనే పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 

అంతేకాకుండా జయ మృతి తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో కలసి పనిచేయనని చెప్పారు. జయలలితకు తానే అసలైన వారసురాలినని మరోసారి స్పష్టం చేశారు.