హైద్రాబాద్‌ లంగర్ హౌస్ లో జవాన్ ఆత్మహత్య: పోలీసుల దర్యాప్తు

చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకొంటున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.  హైద్రాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో  జవాన్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Jawan Commits Suicide in Hyderabad lns

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని లంగర్ హౌస్  పోలీస్ స్టేషన్ పరిధిలో  జవాన్ రాజీందర్ బుధవారంనాడు  ఆత్మహత్య చేసుకున్నారు.మృతుడు పంజాబ్ రాష్ట్ర వాసిగా  పోలీసులు గుర్తించారు.మృతదేహన్ని  పోస్టుమార్టం కోసం  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో  పోలీస్ శాఖలో  పనిచేసే వారు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు  చోటు చేసుకున్నాయి. ఈ నెల  5వ తేదీన  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఎస్కార్ట్  వాహనం ఎఎస్ఐ ఫజల్ అలీ  ఆత్మహత్య చేసుకున్నాడు. హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో చేరిన కొద్దిసేపటికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కూతురి ముందే  ఫజల్ అలీ  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఏడాది  అక్టోబర్ 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో  కుటుంబ సభ్యులను హత్య చేసి  ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్.2022  మే 16న కానిస్టేబుల్  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గత ఏడాది  జనవరి  10న  ఖమ్మంలో ఏఆర్ కానిస్టేబుల్  లాడ్జీలో  ఆత్మహత్య చేసుకున్నాడు.  నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందే  కానిస్టేబుల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

2021  నవంబర్ 4న  మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  మచిలీపట్టణంలో  ఈ ఘటన జరిగింది.  కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగింది.

ఆత్మహత్యలు చేసుకోవద్దు: మానసిక నిపుణులు

చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకొంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదౌతున్నాయి. సమస్యలు వచ్చిన సమయంలో  ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. కానీ  ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని  మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

జీవితంలో  సమస్యలకు  ఆత్మహత్యలు పరిష్కారం కావని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్యనైనా  ధైర్యంగా ఎదుర్కోవాలని సైక్రియాటిస్టులు సూచిస్తున్నారు. జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios