ఆమ్రపాలి.. ఈ పేరు తెలంగాణ, ఆంధ్రా యూత్ లో బాగా పాపులర్ అయింది. చిన్నవయసులోనే ఐఎఎస్ పాసై రికార్డు నెలకొల్పారు ఆమ్రపాలి. ఇప్పుడు వరంగల్ అర్బన్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమె త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మంచిదే కదా? ఇందులో ఆమె ఫ్యాన్స్ కు చేదువార్త ఏంటబ్బా అనుకుంటున్నారా? చదవండి మరి.

ఆమ్రపాలి పెళ్లి వచ్చేనెల 18న కాశ్మీర్ లో జరగనున్నట్ల ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పెళ్లి నేపథ్యంలో ఈనెల 27 నుంచి ఆమ్రపాలి సెలవులో వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆమె వరంగల్ అర్బన్ కలెక్టర్ గా పనిచేస్తుండగా.. వరంగల్ రూరల్ కలెక్టర్ గా ఇన్ఛార్జి కలెక్టర్ గా విధుల్లో ఉన్నారు.రెండు జిల్లాలకు కలెక్టర్ గా సేవలందిస్తున్న ఆమె సెలవుపై వెళ్లడం అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది.

2016 అక్బోరు 11న వరంగల్ అర్బన్ తొలి కలెక్టర్ గా ఆమ్రపాలి విధుల్లో చేరారు. అప్పటినుంచి ఏడాదిన్నర కాలంగా ఆమ్రపాలి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఏది చేసినా సంచలనంగా ఉండే పరిస్థితి ఉండేది. అయితే పరిపాలనలోనూ ఆమె తనదైన ముద్ర వేశారు. వరంగల్ అర్బన్ జిల్లాను ఓడిఎఫ్ గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోశించారు.

ఈ నేపథ్యంలో ఆమె సెలవుపై వెళ్లనుండడం.. పైగా వరంగల్ లో ఉండే చాన్స్ లేదు. దీంతో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలతోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆమె అభిమానులకు అందుబాటులో ఉండే చాన్స్ లేదు కదా? నిత్యం వార్తల్లో ఉండే ఆమ్రపాలి సెలవుపై వెళ్లనుండడం కొంచెం చేదు వార్తగానే ఫ్యాన్స్ కు చెప్పవచ్చు.