Asianet News TeluguAsianet News Telugu

అటెండర్ కంటే హీనంగా చూస్తున్నారు: కలెక్టర్‌ ముందు ఏడ్చిన జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత

జనగామ ఆర్డీఓ మదన్ మోహన్ పై  జనగామ మున్సిపల్ కమిషనర్  రజిత  సోమవారంనాడు కలెక్టర్ కు ఫిర్యాదు  చేశారు.  ఈ  మేరకు  కలెక్టర్ కు ఫిర్యాదు  చేశారు. 

Jangaon Municipal Commissioner  Rajitha Cries infront of Collector
Author
First Published Dec 5, 2022, 5:43 PM IST

జనగామ: సామాన్యులే కాదు  అధికారులు కూడా గ్రీవెన్స్ సెల్  లో  కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక ఆర్డీఓపై  జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత జిల్లా కలెక్టర్ కు సోమవారంనాడు ఫిర్యాదు  చేశారు.  గ్రీవెన్స్ సెల్ లో  కలెక్టర్  ముందే  మున్సిపల్  కమిషనర్  రజిత  కన్నీళ్లు పెట్టుకున్నారు. జనగామ ఆర్డీఓ మదన్ మోహన్ తనకు ఇవ్వాల్సిన  గౌరవం కూడా  ఇవ్వడం లేదని ఆమె ఆవేదన చెందారు. తనను అటెండర్ కంటే హీనంగా  చూస్తున్నారని రజిత ఆవేదన చెందారు.ఈ విషయమై  కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఆర్డీఓ  ఏ రకంగా  తనను ఇబ్బంది పెడుతున్నారో  వివరిస్తూ  మున్సిపల్  కమిషనర్  కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios