సారాంశం

జనగామ బీఆర్ఎస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  నిన్న ముత్తిరెడ్డి యాదగిరికి రెడ్డికి వ్యతిరేకంగా కొందరు భేటీ అయ్యారు.దీనికి కౌంటర్ గా  ఇవాళ  ముత్తిరెడ్డి వర్గీయులు హైద్రాబాద్ లో భేటీ అయ్యారు.

హైదరాబాద్: జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ రాజకీయం వేడేక్కింది.  జనగామ  ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మద్దతుగా ఆయన వర్గీయులు  గురువారంనాడు  హైద్రాబాద్ నాచారంలో  ఓ ఫంక్షన్ హల్ లో సమావేశమయ్యారు.  నిన్న  ప్రగతి భవన్ కు సమీపంలోని  హరిత ప్లాజా హోటల్ లో ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా  అదే నియోజకవర్గానికి చెందిన నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశానికి కౌంటర్ గా  ముత్తిరెడ్డి  యాదగిరి రెడ్డి వర్గీయులు  ఇవాళ నాచారం  ఫంక్షన్ హల్ లో సమావేశమయ్యారు. 

జనగామ ఎమ్మెల్యే టిక్కెట్టును  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇవ్వవద్దని  స్థానికంగా  కొందరు నేతలు  తెరవెనుక చక్రం తిప్పుతున్నారని  ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసులు రెడ్డి,  మరో ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డిలు  జనగామ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారని  ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వర్గీయులు  చెబుతున్నారు. ఈ ఇద్దరు  ఎమ్మెల్సీలు  కలిసి  ఈ దఫా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టిక్కెట్టు దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారని  ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే  నిన్న  ప్రగతి భవన్ కు సమీపంలోని హోటల్ కు  జనగామ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలను పిలిపించారని గుర్తు  చేస్తున్నారు.  

also read:జనగామ జగడం: ప్రగతి భవన్ కు సమీపంలో హోటల్ లో ముత్తిరెడ్డి వ్యతిరేకుల భేటీ

ఇవాళ జనగామలో  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మద్దతుగా  ఆయన వర్గీయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు  చెందిన నేతలు హైద్రాబాద్ లోని నాచారానికి చేరుకున్నారు.  నాచారంలోని ఫంక్షన్ హల్ లో  సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నేతలు మద్దతు ప్రకటించనున్నారు.