తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు టీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. తాను గుంట భూమినైనా కబ్జా చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు.

అంతేకాకుండా తాను భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముత్తిరెడ్డి వెల్లడించారు. తాను తప్పుచేస్తే సీఎం కేసీఆర్ దృష్టిలో శిక్షార్హులేమనని ఎమ్మెల్యే చెప్పారు.

Also Read:77 మందిపై భూకబ్జా ఆరోపణలు: కేసీఆర్ ను ఉతికి ఆరేసిన బండి సంజయ్

బతుకమ్మ కుంట, కుమ్మరి కుంట కబ్జాలు, హన్మంతపూర్ భూముల వ్యవహారంలో ఆరోపణలు చేయడం కాదు.. అవన్నీ వాస్తవాలైతే నిరూపించాలని ముత్తిరెడ్డి సవాల్ విసిరారు. ఆరోపణలన్నీ నిజమైతే జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాం ముందు ముక్కు నేలకు రాస్తానన్నారు.

హన్మంతపూర్‌లో ఒక గుంట ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేయలేదన్నారు. తమది వ్యవసాయ కుటుంబమని.. కష్టం చేసి కొనుక్కోవడమే తప్ప లాక్కోవడం తమకు తెలియని ఆయన వివరించారు. బండి సంజయ్‌కి దమ్ముంటే చేసిన ఆరోపణలన్నీ నిరూపించాలని సవాల్ విసిరారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.