Muthireddy Yadagiri Reddy: నాపై కుట్రలు చేస్తున్నారు.. అన్నీ సీఎంకు తెలుసు.. నేను కేసీఆర్‌కు సైనికుడిని..
Jangaon: తనపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారనీ, ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు తెలుసునని జనగామ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తాను సీఎం కేసీఆర్ సైనికుడినని తెలిపారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నవారి దొంగబతుకులు చూసి బాధపడ్డానని పేర్కొన్నారు.
BRS MLA Muthireddy Yadagiri Reddy: తనపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారనీ, ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు తెలుసునని జనగామ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తాను సీఎం కేసీఆర్ సైనికుడినని తెలిపారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నవారి దొంగబతుకులు చూసి బాధపడ్డానని పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో పాటు సొంత పార్టీ నేతల మధ్య పరోక్షంగా మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు జనగామలో అధికార పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీనికి ప్రధాన కారణం రానున్న ఎన్నికల బరిలో జనగామ టిక్కెట్టు కోసం జరుగుతున్న పోరుగా స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.
ఇదే నేపథ్యంలో తనపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని పేర్కొన్న జనగామ ఎమ్మెల్యే ముత్తురెడ్డి యాదగిరి రెడ్డి.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీనికి హరితా ప్లాజా వేదికగా వేదికగా మారడంతో.. బుధవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాటల యుద్ధం మరింతగా ముదిరి స్థానిక రాజకీయాలను హాట్ హాట్ గా మార్చాయి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధికి అడ్డం పడితే కఠినంగా వ్యవహరిస్తూ.. గుండాలను కంట్రోల్ చేసిన గూండాగాన్నే. గుండాగిరి చేస్తే సింహా స్వప్నంలా మారానని చెప్పారు. తనపై కావాలని వివాదాలు సృష్టించారని పేర్కొన్నారు. తనపై సృష్టించిన కుట్రలు కుతంత్రాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసుననీ, తాను ఎప్పటికీ కేసీఆర్‌కు సైనికుడినేనని అన్నారు.
అలాగే, హరిత ప్లాజాలో జరిగిన సమావేశం గురించి మాట్లాడుతూ.. ఛాయ్‌లు తాగి, సమోసాలు తినే వాళ్లు కొందరు బుధవారం హరిత ప్లాజాలో సమావేశమయ్యారని చెప్పారు. ఇక జనగామ, మద్దూర్, జనగామ రూరల్, బచ్చన్నపేట, తరిగొప్పుల, చేర్యాల, కొమురవేల్లి మండలాల నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికే టికెట్ ఇవ్వాలని సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తీర్మానించారు. ఇదే విషయాన్నిప్రస్తావిస్తూ.. స్థానిక ప్రజా ప్రతినిధులు అంతా తనతోనే ఉన్నారని చెప్పారు. చివరకు సమావేశం గురించి తెలిసి అక్కడకు వెళ్లాననీ, రూంలో ఉండి తలుపులు పెట్టున్నారనీ, హోటల్‌లో గంప కింద కోళ్లలా మారిన వాళ్ల దొంగ బతుకులను చూసి బాధపడ్డానని పేర్కొన్నారు.