Asianet News TeluguAsianet News Telugu

మల్కాజిగిరిపై కన్నేసిన ‘జనసేన’.. టికెట్ కోసం పోటాపోటీ....

తెలంగాణలో బీజేపీతో పొత్తుతో ఎన్నికల బరిలో నిలవనుంది జనసేన. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి స్థానంపై కన్నేసింది. 

Janasena wanted to contest in Malkajgiri in telangana elections - bsb
Author
First Published Oct 27, 2023, 9:45 AM IST | Last Updated Oct 27, 2023, 9:45 AM IST

మల్కాజిగిరి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన తెలంగాణలో గెలిచే స్థానాలపై దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాదులో కొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమవుతోంది. ఇక బిజెపి, జనసేన పొత్తు విషయం ఇప్పటికే చర్చల్లో ఉన్నప్పటికీ ఒకటి రెండు రోజుల్లో దీనిమీద పూర్తి స్పష్టత రానుంది. ఇక ముందుగానే జనసేన మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంపై కన్నేసింది. బిజెపి జనసేన పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.  

ఇక్కడి నుండి ఒక కీలక నేతను జనసేనాని పోటీలో ఉంచబోతున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇక మరోవైపు మల్కాజ్గిరి నుంచి బిజెపి టికెట్ కోసం నలుగురు నేతలు జోరుగా పైరవీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ప్రముఖ బిల్డర్ జీకే కన్స్ట్రక్షన్స్ అధినేత జీకే హనుమంతరావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్,  మల్కాజిగిరి కార్పొరేటర్ ఉరపల్లి శ్రవణ్ లు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్రావు ఈసారి పోటీ చేయడానికి అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. 

తెలంగాణ ఎన్నికలు : వైఎస్సార్ టీపీకి బైనాక్యులర్ గుర్తు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు..

దీంతో ఢిల్లీ స్థాయిలో ఈ నలుగురు జోరుగా పైరవీలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ నలుగురిలో కూడా ముఖ్యంగా భాను ప్రకాష్, ఆకుల రాజేందర్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు  వినిపిస్తోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఆకుల రాజేందర్ అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios