BJP -JANASENA: పొత్తయితే కుదిరింది.. మరీ ప్రచారం సంగతేంటీ ? జనసేనానికి ఎదురయ్యే తిప్పలేంటీ?
Pawan Kalyan: బీజేపీ- జనసేన మధ్య పొత్తు కుదిరింది. కానీ, ప్రచారం సంగతేంటి? ఈ ప్రచారంలో జనసేనాని పవన్ పాల్గొంటారా? పాల్గొంటే ప్రచారంలో ఎవర్నీ టార్గెట్ చేస్తారు? ఇంతకీ బిజెపి- జనసేన పొత్తుతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే ప్రశ్నలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.
BJP -JANASENA: తెలంగాణ రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అందరూ అనుకున్నట్టుగానే బీజేపీతో జనసేన జతకట్టింది. పొత్తులో భాగంగా అనుకున్న విధంగా సీట్లు కూడా దక్కించుకుంది. అయితే.. ఇక్కడే జనసేనాని పవన్ కళ్యాణ్ కు అసలు కష్టాలు మొదలయ్యాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. జనసేనానికి కష్టాలేంటీ? అని అనుకుంటున్నారు కాదు. పొత్తు అయితే.. కుదిరింది. కానీ.. ఈ ఎన్నికల ప్రచారంలో జనసేనాని పాల్గొన్నారా? ఒకవేళ ప్రచారంలోకి అడుగుపెడితే..పూర్తిస్తాయిలో ప్రచారం సాగిస్తారా? పాల్గొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలను విమర్శిస్తారా? ఇవే ప్రశ్నలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.
గత కొద్దీ రోజులుగా (చంద్రబాబు అరెస్ట్ అనంతరం) ఏపీలో పవన్ కళ్యాణ్ పవర్ పాలిటిక్స్ ఫ్లే చేశారు. టీడీపీకు అండగా నిలిచి అందరి ద్రుష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. ఆంధ్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కానీ, తెలంగాణలో ఎన్నికల్లో సైకిల్ పోటీ నుంచి తప్పుకోవడంతో జనసేనాని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనివార్యంగా మారింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఈ అసెంబ్లీ పోరులో గులాబీ దళాన్ని కాషాయసేనతో జనసేనాని ఎలా ఎదుర్కొబోతున్నాడు అనే అసలు ప్రశ్న.
వాస్తవానికి కొద్ది రోజులుగా తెలంగాణలో తాము పోటీ చేస్తామని జనసేన మొదటి నుంచి చెపుతూ వస్తోంది. బీజేపీ అధిష్టానం కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు .. కేసీఆర్ ను ఓడించాలంటే పొత్తు అవసరమని, అలాగే.. కాంగ్రెస్ ని జనాలకు దరికి చేరకుండా చేయాలని యోచిస్తున్న తరుణంలో బీజేపీకి జనసేన రూపంలో ఓ తోడు దొరికింది. అయితే.. జనసేనతో జట్టు కట్టడం బిజెపికి లాభమా ? నష్టమా? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇదిలాఉంటే.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కాలుమోపనున్నారు. రాష్ట్రం నడిబొడ్డున నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత జరుగనున్న భారీ బహిరంగ సభ కావడం. ఈ సభలో ప్రధాని మోడీతో కలిసి జనసేన అని పవన్ కళ్యాణ్ వేదికను పంచుకోవడంతో ఈ సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఈ సభలో ప్రధాని మోడీ.. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తే.. మరీ జనసేనాని ఎవర్ని టార్గెట్ చేస్తారు. ఏ అంశాలను లేవనెత్తుతారు. అనేది మరో ప్రశ్న..
తెలంగాణ రాజకీయాలతో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక సంబంధం లేకున్నా.. తన సినిమాలతో ఇక్కడ రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. ఆయన సినిమా ప్రోగ్రామ్స్ కు అధికార పార్టీ నేతలు హాజరైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నేతలకు టార్గెట్ చేస్తూ.. విమర్శనాస్త్రాలు సంధిస్తారా ? ఒక వేళ విమర్శిస్తే.. ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారనే ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నేతలతో తనకున్న రిలేషన్ బ్రేక్ అయ్యే చాన్స్ లేకపోలేదు. ఆ సహాసానికి పవన్ కళ్యాణ్ సిద్దమవుతారా? లేదా? అనే సందేహం వ్యక్తమతోంది. ఒకవేళ ప్రభుత్వానికి నెగిటివ్ గా మాట్లాడే సాహసం చేసినా.. పవన్ తరచుగా మాట్లాడే నిరుద్యోగం పైన ప్రశ్నలు సంధించి..ఏదో అయిపోయిందని అనిపిస్తారు అంటున్నారు రాజకీయ పండితులు.
ఏపీలో పవన్ కళ్యాన్ టిడిపి తో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అక్కడ బిజెపి కంటే టీడీపీకే ఎక్కువగా ప్రియార్టీ ఇస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షడు కాసాని సైకిల్ దిగి కారు ఎక్కిన విషయం తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణ టిడిపిలో ఇప్పుడు అధ్యక్షుడు కూడా లేడు అన్నమాట.
ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ కి అండగా నిలవాలని టిడిపి అంతర్గతంగా తన కేడర్ కు సూచించినట్టు తెలుస్తోంది. మరి ఏపీలో బిజెపికి దగ్గరగా ఉంటున్న టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తుంది. టీడీపీ లాగానే జనసేన కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఒకలా తెలంగాణలో మరోలా నడుచుకుంటుంది. వాస్తవానికి జనసేనతో కలవడం బీజేపీ లోని మెజార్టీ తెలంగాణ నాయకులకి ఇష్టం లేదనే టాక్ ఉంది.
కేవలం ఆ పార్టీ మద్దతు ఇస్తే చాలనీ, ఒక వేళ పార్టీతో బీజేపీ చేతులు కలిపితే.. ఇతర పక్షాలకు ఈ అంశం ప్రచారాస్రంగా మారుతుందని భయపడుతున్నరని సమాచారం. కొందరూ నేతలు భయపడినట్టుగానే జరిగింది. ఈ అసెంబ్లీ పోరులో బీజేపీ ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగి.. కేసీఆర్ ని కొడితేనే బాగుండేదని, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వృధా ప్రయోజనమే అని కొందరూ బిజెపి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. అయినా పవన్ కళ్యాన్ మాటలను తెలంగాణ ఓటర్లు నమ్ముతారా? ఆయన ఇచ్చే హామీలకు విశ్వసిస్తారా ? అనే సందేహలు కూడా లేకపోలేవు.