గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల బరి నుంచి జనసేన పార్టీ తప్పుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో తమ పూర్తి మద్ధతు ఆ పార్టీ బీజేపీకి తెలిపినందున పోటీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించింది.

శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అగ్రనేత డాక్టర్ లక్ష్మణ్‌లు.. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీకి మద్ధతు ప్రకటించిన పవన్.. ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకూడదని జనసైనికులకు పిలుపునిచ్చారు.

Also Read:జీహెచ్ఎంసీతో పాటు అన్ని ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు: డాక్టర్ లక్ష్మణ్

ఏపీ, తెలంగాణల్లో బీజేపీతో కలిసి పనిచేస్తామని రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్ధతు తెలిపారు. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం వుండాలని కోరారు.

సమయం లేకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పొత్తు కుదరలేదని పవన్ వెల్లడించారు. అంతకుముందు బీజేపీ నేతలు.. ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు.