హైదరాబాద్:  జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు తెలంగాణలోని ప్రతి ఎన్నికల్లో జనసేనతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నామని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.


శుక్రవారం నాడు నాదెండ్ల మనోహర్ నివాసంలో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్  లతో గంటపాటు చర్చించారు.ఈ భేటీకి సంబంధించిన చర్చల విషయాలను ఆ పార్టీ నేతలు వివరించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరాం. భవిష్యత్తులో కూడ అన్ని ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఓబీసీ చైర్మెన్ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఈ దఫా ప్రచారానికి ఒప్పుకొన్నారని ఆయన చెప్పారు. 

also read:పవన్‌తో కిషన్ రెడ్డి బేటీ: ఏం జరుగుతోంది?

బీజేపీకి జనసేన తోడుంటే గ్రేటర్ లో మార్పుంటే సాధ్యమని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. గ్రేటర్ లో ప్రచారం చేసేందుకు పవన్ కళ్యాణ్  ఒప్పుకొన్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తమ విన్నపాన్ని మన్నించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల  తరపున ప్రచారం చేసేందుకు పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ ఒప్పుకొన్నారని చెప్పారు.భవిష్యత్తులో కూడ అన్ని ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.