Asianet News TeluguAsianet News Telugu

కొండగట్టుకు బయల్దేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అనుష్టుప్ నారసింహాయాత్రకు శ్రీకారం..

జనసేనాని పవన్ కల్యాణ్ మంగళవారం కరీంనగర్ జిల్లాలోని కొండగట్టుకు బయల్దేరారు. ముందుగా అనుకున్నట్టుగానే వారాహి ప్రచారరథానికి ప్రత్యేక పూజలు చేయించనున్నారు. 

Janasena leader Pawan Kalyan left for Kondagattu - bsb
Author
First Published Jan 24, 2023, 9:40 AM IST

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదు నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టుకు బయలుదేరారు. ఆయన వెంట భారీ కాన్వాయ్ తో జనసేన  నేతలు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 11 గంటలకు కొండగట్టు చేరుకోనున్నారు. జనసేన ఎన్నికల ప్రచార రథమైన ‘వారాహి’కి కొండగట్టులోని అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు చేయించనున్నారు. వేద పండితులు వారాహికి ప్రత్యేకంగా పూజలు చేసి రథాన్ని  ప్రారంభిస్తారు.

ఈ పూజా కార్యక్రమాల తర్వాత కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్ కు  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళతారు. అక్కడ తెలంగాణ ముఖ్య నాయకులతో జనసేన అధినేత సమావేశం అవనున్నారు. ఈ సమావేశం అనంతరం ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకొనున్నారు. జనసేన ని లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ధర్మపురి క్షేత్రం నుంచే అనుష్టుప్ నారసింహాయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్: వారాహికి ప్రత్యేక పూజలు

ఈ యాత్రలో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ దశలవారీగా సందర్శిస్తారు. అయితే ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాదు తిరిగి వస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా.. కొండగట్టు, ధర్మపురి ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని పవన్ కళ్యాణ్ నివాసం వద్దకు మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios