హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమౌతున్న  ప్రజలను ఆదుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జనసైనికులను కోరారు.

తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో తెలంగాణలో 13 మంది, ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు మరణించడం బాధాకరమైన విషయమన్నారు.

also read:ఆరాంఘర్: హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై కొట్టుకొచ్చిన వాహనాలు

హైద్రాబాద్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందడం విషాదకరమని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆయన చెప్పారు. 

వరి, మొక్కజొన్న, పత్తి, మిరప పంటలతో ఉద్యాన పంటలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. లక్షన్నర ఎకరాల్లోని పంట నాశమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

పంట నష్టంతో రైతాంగం సుమారు  రూ. 400 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.కృష్ణా, గోదావరి నదులతో పాటు  రెండు రాష్ట్రాల్లో వాగులు, వంకలు చివరకు చెరువులు సైతం ఉగ్రరూపంతో ప్రజలను ముంచెత్తుతున్నాయి.ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆ పన్నులను ఆదుకోవాలని ఆయన కోరారు.

విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం కలగకుండా  చర్యలు తీసుకోవాలన్నారు.ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆధుకోవాలని ఆయన కోరారు. మృతుల కుటుంబాలను, పంట నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాలను కోరారు.

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  ప్రజలు కోరారు.