భారీ వర్షం కారణంగా హైద్రాబాద్ బెంగుళూరు జాతీయ  రహదారిపై ఆరాంఘర్ వద్ద కార్లు, టూ వీలర్లు వరదలో కొట్టుకువచ్చాయి.ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ వరద నీటిలో కొంత భాగం కుప్పకూలింది.

హైదరాబాద్: భారీ వర్షం కారణంగా హైద్రాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్ వద్ద కార్లు, టూ వీలర్లు వరదలో కొట్టుకువచ్చాయి.ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ వరద నీటిలో కొంత భాగం కుప్పకూలింది.

హైద్రాబాద్ బెంగుళూరు 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆరాంఘర్ ఉంది. అరాంఘర్ కు సమీపంలోని అప్పా చెరువుకు గండిపడింది. దీంతో మంగళవారం నాడు రాత్రి నుండి వరద నీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. దీంతో జాతీయ రహదారిపైనే వాహనాలు నిలిచిపోయాయి.

అప్పా చెరువు వరద నీటిలో లారీలు, డీసీఎంలు, కార్లు, టూ వీలర్లు కొట్టుకువచ్చాయి. ఆరాంఘర్ వద్ద పెద్ద ఎత్తున నీటిలో కొట్టుకువచ్చిన వాహనాలు కన్పిస్తున్నాయి.ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ కుంగిపోయింది. కొంతభాగం వరద నీటికి ఫ్లై ఓవర్ భాగాలు కిందపడ్డాయి. వరదలో కొట్టుకుపోయిన వాహనాల కోసం యజమానులు వెతుకుతున్నారు.

also read:హైద్రాబాద్‌లో భారీ వర్షం: గత రికార్డులు బ్రేక్

చెరువుకు గండి పడిన విషయాన్ని చెప్పినా కూడ కనీసం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద నీటితో జాతీయ రహదారిపై రోడ్డు కోతకు గురైంది. 

44వ నెంబర్ జాతీయ రహదారిని గగన్ పహాడ్ వద్ద రోడ్డును మూసివేశారు. హైద్రాబాద్ నుండి బెంగుళూరు వైపు వెళ్లే వారంతా రాజేంద్రనగర్ పిల్లర్ 216 నుండి హిమాయత్ సాగర్ రాజేంద్రనగర్ ఎంట్రీ 17 తొండుపల్లి ఎగ్జిట్ 16 నుండి ప్రత్యామ్నాయ మార్గంలోకి వెళ్లాలని సూచించారు.