తానోక ఫెయిల్డ్ పొలిటీషియన్‌ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  ఓటమిని ఒప్పుకోవాలని, దీనిపై తానేమీ బ్యాడ్‌గా ఫీల్ కావట్లేదన్నారు

తన రాజకీయ జీవితంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తాను ఫెయిల్డ్ పొలిటీషియన్‌ని అన్న ఆయన.. ఓటమిని ఒప్పుకోవాలని, దీనిపై తానేమీ బ్యాడ్‌గా ఫీల్ కావట్లేదన్నారు. ఓటమే విజయానికి సగం పునాది అని పవన్ పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలని జనసేనాని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో శనివారం జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా సదస్సులో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు.. పేరున్న వాళ్లంతా మహానుభావులు కాదన్నారు. దేవుడినైనా గుడ్డిగా నమ్మొద్దని పవన్ కల్యాణ్ సూచించారు.