సిఎ: భాష రాష్ట్రానికి మంచిది కాదు సిఎం మాదిరిగా నేను మాట్లాడలేను నాకొడుకులు అన్నమాట సరికాదు కోర్టులకు వెళ్లేవారితో మాకు సంబంధం లేదు జాగృతి నేతలే సర్కారుపై కోర్టుకు వెళ్లారు

సిఎం కెసిఆర్ నా కొడుకులు అనే భాష మాట్లాడడం పట్ల సిఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న విలేకరుల సమావేశంలో కెసిఆర్ కమ్మ్యునిస్టు పార్టీలను 'నా కొడుకులని' సీఎం మాట్లాడటం దారుణం అన్నారు జానారెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర వామ పక్షాలది అన్న విషయం గుర్తు ఉంచుకోవాలన్నారు. అధికారం శాశ్వతం కాదని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీలపై కెసిఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యాలను ఖండిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుందన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలను అడ్డుకున్నది ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల పై కోర్టు కు వెళ్లింది జాగృతి నేత కాదా అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని కోరింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కోర్టులకు వెళ్లింది కాంగ్రెస్ వాళ్లు కాదని, కడుపు మండిన వారేనని చెప్పారు. అయినా న్యాయం కోసం కోర్టులకు వెళ్ళడం నేరమా అని ప్రశ్నించారు. గతంలో టీఆరెస్ కోర్టు లకు వెళ్ళి న దానికి ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం హోదాకు తగినట్లు మాట్లాడాలని, కెసిఆర్ వాడుతున్న భాష తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు.

మాజీ స్పీకర్ మీరాకుమార్ ను కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ తక్షణమే మీరాకుమార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. సిరిసిల్ల దళితులపై సీఎం చులకనగా మాట్లాడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులను సస్పెండ్ చేయకుండా వారికె సీఎం మద్దతు పలుకడం దారుణమన్నారు.