సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. జనసేనకు బీజేపీ 10 అసెంబ్లీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది.

హైదరాబాద్: ఈ నెల  27న కేంద్ర మంత్రి అమిత్ షాతో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ, జనసేన సీట్ల షేరింగ్ పై చర్చించనున్నారు.ఈ దఫా కూడ తమకు మద్దతివ్వాలని జనసేనను బీజేపీ కోరింది. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పట్టుదలతో ఉంది. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు ఈ నెల 18న  సమావేశమయ్యారు.  గతంలో జరిగిన  జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో  బీజేపీకి జనసేన మద్దతును ప్రకటించింది. జీహెచ్ఎంసీ  ఎన్నికల సమయంలో  పోటీ చేయాలని జనసేన రంగం సిద్దం చేసుకుంది.ఆ సమయంలో  కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ లు  పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరారు.  ఆ ఎన్నికల్లో  బీజేపీకి  జనసేన మద్దతిచ్చింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  32కిపైగా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని  జనసేన నిర్ణయం తీసుకుంది. తాము పోటీ చేయాలనుకున్న స్థానాల జాబితాను కూడ జనసేన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల  18న పవన్ కళ్యాణ్ తో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు సమావేశమయ్యారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. 

అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయాలని జనసేన పట్టుదలతో ఉంది. ఈ సమయంలో బీజేపీ నేతలు మద్దతివ్వాలని కోరారు. అయితే బీజేపీ నాయకత్వాన్ని  జనసేన 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోరుతుంది. అయితే  జనసేనకు  బీజేపీ  ఎనిమిది నుండి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  కోదాడ, హుజూర్ నగర్, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఆశ్వరావు పేట వంటి అసెంబ్లీ స్థానాలను  జనసేనకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం లేకపోలేదు.

also read:ఈ నెల 28 నుండి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర: బీసీ డిక్లరేషన్, మేనిఫెస్టో విడుదలకు చాన్స్

ఈ నెల 27న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  సూర్యాపేటలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రానున్నారు. అమిత్ షాతో  పవన్ కళ్యాణ్ ఈ నెల  27న భేటీ కానున్నారు. తెలంగాణలో జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం ఉంది.