ఈ నెల 28 నుండి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర: బీసీ డిక్లరేషన్, మేనిఫెస్టో విడుదలకు చాన్స్

ఈ నెల  28వ తేదీ నుండి రెండో విడత బస్సు యాత్రను కాంగ్రెస్ ప్రారంభించనుంది. రాహుల్, ప్రియాంక,సిద్దరామయ్యలు  ఈ యాత్రలో పాల్గొంటారు.

 Congress Plans To Begin Second Bus Yatra from October  28 in Telangana lns


హైదరాబాద్: ఈ నెల  28వ తేదీ నుండి  రెండో విడత బస్సు యాత్రను  కాంగ్రెస్ పార్టీ ప్రారంభించనుంది. ఈ నెల  18 నుండి 20వ తేదీ వరకు  కాంగ్రెస్ పార్టీ తొలి విడత బస్సు యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. మూడు రోజుల పాటు బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బస్సు యాత్రను ప్రారంభించిన తర్వాత  ప్రియాంక గాంధీ న్యూఢిల్లీ వెళ్లిపోయారు. ఆర్మూర్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొని  రాహుల్ గాంధీ బస్సు యాత్రను ముగించారు.  న్యూఢిల్లీలో అత్యవసర సమావేశం కారణంగా నిజామాబాద్ సభను రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు.

తెలంగాణలో మూడు విడతలుగా బస్సు యాత్రను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.  తొలి విడత బస్సు యాత్ర  ములుగు, కరీంనగర్, జగిత్యాల, ఆర్మూర్ వరకు  సాగింది.  రెండో విడత బస్సు యాత్రను  దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాగేలా  పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రెండో విడత బస్సు యాత్ర సాగేలా కాంగ్రెస్ నేతలు రూట్ మ్యాప్ ను ఖరారు చేస్తున్నారు.

ప్రియాంక, రాహుల్ గాంధీలతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఈ నెల  28, 29 తేదీల్లో జరిగే బస్సు యాత్రలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాల్గొంటారు.  ఈ నెల  30. 31 తేదీల్లో జరిగే బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు.నవంబర్ 1న బస్సు యాత్రలో  రాహుల్ గాంధీ పాల్గొనేలా కాంగ్రెస్ నేతలు రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నారు.ఈ నెల  31న  కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించనుంది.  కొల్లాపూర్ లో సభలో  ప్రియాంక గాంధీ పాల్గొనే అవకాశం ఉంది.

also read:ఈ నెల 26 నుండి రెండో విడత బస్సు యాత్ర: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ

బస్సు యాత్రను పురస్కరించుకొని నిర్వహించే బహిరంగ సభలో కర్ణాటక సీఎం  సిద్దరామయ్య చేతుల మీదుగా  బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరో వైపు రాహుల్ గాంధీ పాల్గొనే సభలో  ఎన్నికల మేనిఫెస్టోను కూడ విడుదల చేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios