Asianet News TeluguAsianet News Telugu

చేదు అనుభవం: నాడు తండ్రి, నేడు కొడుకు చేతిలో జానారెడ్డి ఓటమి

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డి  నోముల నర్సింహ్మయ్య  తనయుడు  భగత్  చేతిలో ఓటమి పాలయ్యారు. తండ్రీ కొడుకుల చేతిలో ఓటమి పాలైన రికార్డును జానారెడ్డి మూటగట్టుకొన్నారు. 

Jana Reddy defeated from Nagarjunasagar bypolls lns
Author
Hyderabad, First Published May 2, 2021, 2:16 PM IST

నల్గొండ:నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డి  నోముల నర్సింహ్మయ్య  తనయుడు  భగత్  చేతిలో ఓటమి పాలయ్యారు. తండ్రీ కొడుకుల చేతిలో ఓటమి పాలైన రికార్డును జానారెడ్డి మూటగట్టుకొన్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం (గతంలో చలకుర్తి) నియోజకవర్గం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించారు. రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహ్మయ్య చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు.

also read:నాగార్జునసాగర్‌లో ప్రభావం చూపని బీజేపీ: ఓట్లు పెంచుకొన్న కమలం

అనారోగ్యంతో నోముల నర్సింహ్మయ్య మరణించడంతో  ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. నోముల నర్సింహమ్య తనయుడు భగత్ ను టీఆర్ఎస్ బరిలోకి దింపింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి భగత్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిపై విజయం సాధించారు.  గతంలో జానారెడ్డిపై నోముల నర్సింహ్మయ్య విజయం సాధించారు. అదే జానారెడ్డిపై నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ కూడ గెలుపొందారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధుల చేతిలోనే జానారెడ్డి ఈ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios