Exit Polls 2024 : తెలంగాణలో బిజెపిదే ఆధిక్యం... జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్ని సీట్లంటే...

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంటుందని జన్ కీ బాత్ సర్వే ఎగ్జిట్ పోల్ పలితాలు చెబుతున్నాయి.  కాంగ్రెస్, బిఆర్ఎస్ ల పరిస్థితి ఏమిటో ఈ సర్వే తేేల్చింది. 

jan ki baat exit poll results on Lok Sabha seats in Telangana AKP

హైదరాబాద్ : తెలంగాణలో బిజెపి పార్టీ అద్భుతం చేస్తుందని జన్ కీ బాత్ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా బిజెపి 9 నుండి 12 వవరకు సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు రావని... కేవలం 4 నుండి 7 స్థానాలకే పరిమితం అవుతుందని ప్రకటించారు. బిఆర్ఎస్ ఖాతా తెరవకపోయిన అశ్చర్యపోనవసరం లేదనే విధంగా ఈ సర్వే ఫలితాలున్నాయి... గెలిచినా కేవలం ఒక్క స్ధానంలోనే అట హైదరాబాద్ లో ఎంఐఎం గెలుస్తుందని జన్ కీ బాత్ సర్వే తేల్చింది. 

 దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగ్గా... తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరిగింది. నాలుగో దశలో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పోలింగ్ జరిగింది. అయితే తెలంగాణలోని అన్ని లోక్ సభ స్థానాల్లో బిజెపి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ కూడా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే రిపీట్ చేయాలని చాలా కష్టపడింది. కానీ సర్వే ఫలితాలు బిజెపికి ఆధిక్యత చూపిస్తున్నాయి. 

ఇక గత పదేళ్లు తెలంగాణను పాలించిన బిఆర్ఎస్ పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారయ్యింది. ఈ పార్టీ  కనీసం ఖాతా తెరిచే పరిస్థితి లేదంటేనే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎంతలా బలహీనపడిందో అర్థమవుతుంది. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మరంగా ప్రచారం  చేసిన ప్రజలు ఆయనను నమ్మలేదని ఈ సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios