మోడీ అంటే కేసిఆర్ కు ప్రేమ.. భయం రెండూ ఉన్నాయి : జైపాల్ రెడ్డి

jaipal reddy fire on kcr and modi
Highlights

కేసిఆర్, మోడీ ది అక్రమ సంబంధం

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లో భారీ ర్యాలీ జరిపి ఆయన చార్జ్ తీసుకున్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కేసిఆర్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. మోడీని కూడా ముగ్గులోకి గుంజి విమర్శలు గుప్పించారు. ఆయనేమన్నారో చదవండి.

రాష్ట్ర అవతరణ దినోత్సవం అందరిది. కానీ సీఎం కెసిఆర్ ఒక్కరే చేసుకుంటున్నారు. నేను ఢిల్లీలో అర్బన్ డెవలప్ మినిస్టర్ గా ఉన్నప్పుడే మెట్రో మంజూరు చేశాను. నేను మంత్రిగా ఉన్నప్పుడే 4వేల కోట్ల నిధులు మంజూరు చేశాను. కెసిఆర్ నరేంద్ర మోడీతో స్నేహం చేస్తున్నారు...అది అక్రమ సంబంధం. మోడీ అంటే కెసిఆర్ కు ప్రేమ...భయం రెండూ ఉన్నాయి. తెలంగాణ బిల్లు పాస్ సమయంలో మోడీ బిల్లును వ్యతిరేకించారు. కానీ మోడీపై కెసిఆర్ ప్రేమ చూపుతున్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా పై కెసిఆర్ కు కృతజ్ఞతా భావన చూపడంలేదు. అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ఉంటే ఆరేటు కట్టేందుకు వినియోగదారులు సిద్దంగా ఉన్నారు. బీజేపీ కావాలని పెట్రో రేట్లు పెంచుతుంది. నరేంద్ర మోడీ పన్నులు వేసే ఉగ్రవాది. 2019 లో మిత్ర పక్షాలతో కాంగ్రెస్ ఎర్రకోట పై జెండా ఎగురవేస్తారు.

loader